నటి , నిర్మాత కృష్ణవేణి ఇక లేరు

Update: 2025-02-16 03:12 GMT

ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.



ఆమె వయసు 101 సంవత్సరాలు.




 నందమూరి తారక రామారావు గారిని మనదేశం సినిమాలో సినిమా రంగానికి పరిచయం చేశారు.all

కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసారు

1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు.

కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్య గారితో వివాహం జరిగింది.

ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది.

1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసారు.

ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసారు.

1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసారు

తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది.

కృష్ణవేణి గారు నిర్వహించిన నిర్మాణ సంస్థలు

భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.

సొంత సంస్థ - తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్

కృష్ణవేణి గారు నిర్మించిన సినిమాలు

మన దేశం (1949)

లక్ష్మమ్మ (1950)

దాంపత్యం (1957)

గొల్లభామ (1947)

భక్త ప్రహ్లాద (1942)

Tags:    

Similar News