బాలయ్య vs పవన్.. దసరా హీట్ ఆన్!
అనుకున్నట్టే బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫమ్ అయ్యింది. దసరా బరిలో బాలయ్య-పవన్ సినిమాలు ఒకేసారి విడుదలకు ముస్తాబవుతున్నాయి.;
అనుకున్నట్టే బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫమ్ అయ్యింది. దసరా బరిలో బాలయ్య-పవన్ సినిమాలు ఒకేసారి విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్'తో వచ్చిన బాలయ్య.. దసరా బరిలో 'అఖండ 2'ని తీసుకు రాబోతున్నట్టు ప్రకటించాడు. 'అఖండ 2' ముహూర్తం రోజునే విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.
అయితే పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'ఓజీ'కి కూడా 'అఖండ 2' డేట్ నే ఫిక్స్ చేశారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న 'ఓజీ' విడుదల కానున్నట్టు అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్. 'ఓజీ' దసరాకి వస్తుండటంతో 'అఖండ 2' వాయిదా పడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
కట్ చేస్తే.. లేటెస్ట్ గా రిలీజైన 'అఖండ 2' టీజర్ లో మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది టీమ్. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ దసరాకే తీసుకు రాబోటున్నట్టు టీజర్ లో క్లారిటీ ఇచ్చేశారు. ఈనేపథ్యంలో.. వచ్చే దసరా బరిలో బాలయ్య వర్సెస్ పవన్ క్లాష్ పక్కా అనే క్లారిటీ వచ్చేసింది.