200 థియేటర్లలో 50 రోజులు
ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో సంచలనంగా నిలిచిన చిత్రాల్లో 'మహావతార్ నరసింహ'ది అగ్రస్థానం. యానిమేషన్ సినిమా అంటే పిల్లలకే పరిమితమైపోయే రోజులు పోయాయి.;
ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో సంచలనంగా నిలిచిన చిత్రాల్లో 'మహావతార్ నరసింహ'ది అగ్రస్థానం. యానిమేషన్ సినిమా అంటే పిల్లలకే పరిమితమైపోయే రోజులు పోయాయి. ఇప్పుడు అదే యానిమేషన్ ఫార్మాట్‌లో తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది.
దర్శకుడు అశ్విన్ కుమార్ తన ఆస్తులను తాకట్టు పెట్టి కేవలం రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఎటువంటి స్టార్ కాస్టింగ్ లేకుండా, పెద్ద ప్రమోషన్లు లేకుండా, కేవలం కథా బలం మీద ఉన్న నమ్మకంతో సినిమా తెరకెక్కించగా ఫలితం అసలైన బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.
జూలై 25న రిలీజ్ అయిన ఈ చిత్రం రోజురోజుకీ పెరిగిన మౌత్ టాక్ తో 50 రోజులు పూర్తి అయ్యేసరికి వరల్డ్ వైడ్ గా రూ.319 కోట్లు దాటేసింది. వీటిలో ఇండియాలో రూ.291 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.28 కోట్లు వసూలు చేయడం విశేషం.
ఇప్పటి కాలంలో ఏ సినిమా అయినా రెండు వారాలు బలంగా నడిస్తే హిట్‌గా పరిగణిస్తారు. కానీ 'మహావతార్ నరసింహ' మాత్రం 200 థియేటర్స్‌లో 50 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఇది చాలా ఏళ్ల తర్వాత మళ్లీ చూసిన అరుదైన ఘనత.