‘మిరాయ్’ మాస్ ఓపెనింగ్
యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో, మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, రికార్డ్ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది.;
By : S D R
Update: 2025-09-13 09:04 GMT
యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో, మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, రికార్డ్ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించారు మేకర్స్.
నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ.27.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇది తేజ సజ్జా కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రానికి ఇది భారీ బూస్ట్ అని చెప్పాలి. ‘మిరాయ్’కు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ శనివారం, ఆదివారం వీకెండ్ కాబట్టి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.