ఐశ్వర్యరాయ్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా పలు వెబ్‌సైట్లు, ప్లాట్‌ఫార్మ్‌లు తన ఫోటోలు, వీడియోలను వాడుకుంటున్నాయని, మరికొన్ని AI-జనరేటెడ్ మార్ఫింగ్ కంటెంట్ ద్వారా అశ్లీల వీడియోలు కూడా ప్రసారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది.;
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా పలు వెబ్‌సైట్లు, ప్లాట్‌ఫార్మ్‌లు తన ఫోటోలు, వీడియోలను వాడుకుంటున్నాయని, మరికొన్ని AI-జనరేటెడ్ మార్ఫింగ్ కంటెంట్ ద్వారా అశ్లీల వీడియోలు కూడా ప్రసారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది.
ఈ కేసును విచారించిన హైకోర్టు, ఐశ్వర్యరాయ్‌కు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది. ఇకపై ఆమె అనుమతి లేకుండా ఎవరు కూడా ఫోటోలు, వీడియోలు, పేరు వాడకూడదని స్పష్టం చేసింది. ఇది ఆమె ప్రచార, వ్యక్తిగత హక్కులను రక్షించే తీర్పు అని పేర్కొంది.
అలాగే పిటిషన్‌లో గుర్తించిన యూ ఆర్ ఎల్‌లను వెంటనే బ్లాక్ చేయాలని గూగుల్ సహా ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, ఇతర ప్లాట్‌ఫార్ములకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు అందిన 72 గంటల్లో చర్యలు తీసుకోవాలని, కేంద్ర ఐటీ శాఖ దీనిపై పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
ఐశ్వర్య ఫోటోల దుర్వినియోగం ఆమెకు ఆర్థిక నష్టమే కాకుండా గౌరవం, ప్రతిష్ఠకు కూడా భంగం కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఇకపై అనుమతి లేకుండా ఆమె పేరు, ఫోటోలు వాడిన వారిపై శిక్ష తప్పదని హెచ్చరించింది.