‘ఘాటి‘ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత అందాల తార అనుష్క నుంచి రాబోతున్న చిత్రం ‘ఘాటి‘. విలక్షణ దర్శకుడు క్రిష్, అనుష్క కలయికలో 'వేదం' తర్వాత రూపొందుతున్న చిత్రమిది.;
By : S D R
Update: 2025-06-02 10:16 GMT
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత అందాల తార అనుష్క నుంచి రాబోతున్న చిత్రం ‘ఘాటి‘. విలక్షణ దర్శకుడు క్రిష్, అనుష్క కలయికలో 'వేదం' తర్వాత రూపొందుతున్న చిత్రమిది. అసలు ఏప్రిల్ లోనే ఈ సినిమా రిలీజవ్వాల్సి ఉంది. అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ గా ‘ఘాటి‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
జూలై 11న వరల్డ్ వైడ్ గా ‘ఘాటి‘ విడుదలకు ముస్తాబవుతుంది. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.