మనవడి రాకతో ఉప్పొంగిన మెగాస్టార్

మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ కుటుంబంలో మూడో తరం వారసుడు వచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి దంపతులకు ఈ రోజు ఉదయం పండంటి మగబిడ్డ జన్మించాడు.;

By :  S D R
Update: 2025-09-10 13:13 GMT

మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ కుటుంబంలో మూడో తరం వారసుడు వచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి దంపతులకు ఈ రోజు ఉదయం పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ సంతోషకర వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్‌ను ఆపి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు.

చిన్నారిని ఒడిలోకి ఎత్తుకున్న చిరు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ క్షణాన్ని తన అభిమానులతో పంచుకుంటూ, సోషల్ మీడియా వేదికగా బిడ్డను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు. 'కొణిదెల కుటుంబంలోకి మరో చిన్నారి రాక. వరుణ్, లావణ్యలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నాగబాబు, పద్మజలు తాత–నానమ్మలుగా ప్రమోట్ కావడం ఆనందంగా ఉంది. మన బుజ్జి బిడ్డ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ కూడా సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘మా లిటిల్ మ్యాన్’ అంటూ ఒడిలో బిడ్డను ఎత్తుకున్న లావణ్య నుదిటిపై ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేశాడు. ఇంతకుముందు చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ దంపతులకు అమ్మాయి పుట్టింది. అలాగే చిరు కుమార్తెలు ఇద్దరికీ ఆడపిల్లలు ఉన్నారు. అయితే, కొణిదెల కుటుంబంలో మూడో తరంలో తొలి మగ వారసుడిగా వరుణ్ కుమారుడు నిలిచాడు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు వరుణ్–లావణ్యలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



Tags:    

Similar News