సోల్జర్ Vs సోల్జర్
ఒళ్లు గగుర్పొడిచే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ అనగానే హాలీవుడ్ ముందుగా గుర్తుకొస్తుంది. అలాంటి తరహా చిత్రాలను ఇండియన్ హీరోలతో నిర్మించి హాలీవుడ్ స్థాయి గుర్తింపు పొందిన సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.;
ఒళ్లు గగుర్పొడిచే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ అనగానే హాలీవుడ్ ముందుగా గుర్తుకొస్తుంది. అలాంటి తరహా చిత్రాలను ఇండియన్ హీరోలతో నిర్మించి హాలీవుడ్ స్థాయి గుర్తింపు పొందిన సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి వస్తోన్న మరో ప్రెస్టేజియస్ మూవీ ‘వార్ 2‘.
ఇప్పటివరకూ నార్త్ హీరోలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టిన యష్ రాజ్ ఫిల్మ్స్ తొలిసారిగా సౌత్ స్టార్ ఎన్టీఆర్ ను తమ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం చేసుకుంది. తమ స్పై యూనివర్శ్ ఫ్రాంఛైజ్ లో ఆరో చిత్రంగా.. సూపర్ హిట్ ‘వార్‘కి సీక్వెల్ గా ‘వార్ 2‘ని తీసుకొస్తుంది. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో.. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇక.. లేటెస్ట్ గా రిలీజైన ‘వార్ 2‘ ట్రైలర్ అన్ని అనుమానాలను పటాపంచలు చేసింది. గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ కి దీటుగా ఈ ట్రైలర్ లో తారక్ రెచ్చిపోయాడు. యాక్షన్, ఎమోషన్ అన్ని యాంగిల్స్ లోనూ హృతిక్ తో పోటీ పడుతూ ఎన్టీఆర్ ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఈ ట్రైలర్ ను బట్టి ఈ సినిమాలో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది తేల్చుకోవడం కష్టమే. మొత్తంగా.. ఆగస్టు 14న రాబోతున్న ‘వార్ 2‘ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.