'కింగ్డమ్' కోసం సందీప్ రెడ్డి!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటింగ్ మూవీ 'కింగ్డమ్' రిలీజ్ కు రెడీ అవుతుంది. జూలై 31న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలవుతుంది.;

By :  S D R
Update: 2025-07-25 00:48 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటింగ్ మూవీ 'కింగ్డమ్' రిలీజ్ కు రెడీ అవుతుంది. జూలై 31న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలవుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇప్పటికే నిర్మాత నాగవంశీ వరుస ఇంటర్యూలు ఇస్తుండగా.. ఇప్పుడు హీరో విజయ్, డైరెక్టర్ గౌతమ్ కూడా ప్రచారంలోకి దిగారు.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'కింగ్డమ్' హీరో, డైరెక్టర్స్ విజయ్, గౌతమ్ తిన్ననూరి లతో చేసిన స్పెషల్ ఇంటర్యూకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇంటర్యూ త్వరలో రిలీజ్ కానుంది. మొత్తంగా.. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో 'కింగ్డమ్'పై బజ్ భారీగా పెరిగింది. రేపు (జూలై 26) విడుదలయ్యే ట్రైలర్ తో ఈ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.



Tags:    

Similar News