ఫైట్ మాస్టర్ గా పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే కాదు డైరెక్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ఫైట్స్ కొరియోగ్రాఫర్ కూడా. మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ అయిన పవర్ స్టార్.. తన సినిమాలకోసం అప్పుడప్పుడూ ఫైట్స్ కంపోజ్ చేశాడు.;

By :  S D R
Update: 2025-04-17 10:32 GMT

పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే కాదు డైరెక్టర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ఫైట్స్ కొరియోగ్రాఫర్ కూడా. మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ అయిన పవర్ స్టార్.. తన సినిమాలకోసం అప్పుడప్పుడూ ఫైట్స్ కంపోజ్ చేశాడు. అలాగే చిరంజీవి నటించిన ‘డాడీ‘ చిత్రంలో పవన్ కంపోజ్ చేసిన ఫైట్ కి మంచి అప్లాజ్ వచ్చింది.

లేటెస్ట్ గా ‘హరి హర వీరమల్లు‘కి కూడా పవన్ ఓ ఫైట్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ చేశాడట. ఈ సినిమాలొ పవర్ స్టార్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ ఎంతో హైలైట్ గా ఉండనుందట. ఇంటర్నేషనల్ స్టంట్స్ మాస్టర్స్ సహకారంతో 61 రోజుల పాటు భారీ జన సందోహం మధ్య ఈ ఫైట్ ను చిత్రీకరించారట.

మొత్తంగా మే 9న విడుదలకు ముస్తాబవుతుంది ‘హరి హర వీరమల్లు‘. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రచారంలో స్పీడు పెంచాల్సి ఉంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పెండింగ్ ఉందట. పవన్ కళ్యాణ్ తో కొంత భాగం చిత్రీకరణ చేయాల్సి ఉందట. ఈనేపథ్యంలో ‘హరి హర వీరమల్లు‘ ఈసారి కూడా అనుకున్న సమయానికి వస్తోందా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి.

Tags:    

Similar News