‘ఓజీ‘ సెట్స్‌లోకి పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు‘ని ఫినిష్ చేసిన పవర్ స్టార్ ఇప్పుడు ‘ఓజీ‘ని కూడా రీస్టార్ట్ చేశాడు. ఈరోజు నుంచే పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సెట్స్ లోకి తిరిగి అడుగుపెట్టాడు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు‘ని ఫినిష్ చేసిన పవర్ స్టార్ ఇప్పుడు ‘ఓజీ‘ని కూడా రీస్టార్ట్ చేశాడు. ఈరోజు నుంచే పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సెట్స్ లోకి తిరిగి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
‘ది ఓజీ స్టెప్స్ ఇన్ టూ హిజ్ అరెనా‘ అని పోస్ట్ చేసి ‘పి.కె. బ్యాక్ ఆన్ ఓజీ సెట్స్‘ అంటూ హ్యాష్ ట్యాగ్ ను జతచేసింది డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత తాడేపల్లి, ముంబై వంటి ప్రాంతాల్లోనూ షూటింగ్ కొనసాగనుందట.
ప్రస్తుతం హీరో పవన్ కళ్యాణ్, విలన్ పాత్రధారి ఇమ్రాన్ హష్మీ మధ్య కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటాయట. స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ‘ఓజీ‘ ఆడియన్స్ ముందుకు రానుంది.