'వీరమల్లు' టికెట్ బుకింగ్స్ హీట్
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' మరికొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.;
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' మరికొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా బుకింగ్స్ మంగళవారం నుంచి ప్రారంభమవగా, ఒక్కసారిగా అభిమానుల రష్‌తో ప్రీమియం సీట్లు తక్కువ సమయంలోనే ‘సోల్డ్ అవుట్’గా మారాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చాయి. ఏపీలో పెయిడ్ ప్రీమియర్ టికెట్ ధర రూ.600గా ఉండగా, రిక్లైనర్/సోఫా సీట్లు రూ.1000 దాటాయి. బాల్కనీ టికెట్ రూ.830, సెకండ్ క్లాస్ రూ.790గా ఉన్నప్పటికీ బుకింగ్ ఛార్జీలు అదనం. రెగ్యులర్ షోల్లో మల్టీప్లెక్స్ టికెట్లు రాయల్ సీటింగ్ రూ.495, ఎగ్జిక్యూటివ్ సీటింగ్ రూ.377గా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బాల్కనీ రూ.250, ఫస్ట్ క్లాస్ రూ.150గా నిర్ణయించారు.
తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు ఇంకా ప్రారంభం కాకపోయినా, రెగ్యులర్ షోలకు రాయల్ సీటింగ్ రూ.500, ఎగ్జిక్యూటివ్ రూ.413, బాల్కనీ రూ.300, ఫ్రంట్ సర్కిల్ రూ.200 ధరలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం మొదటి 10 రోజులు మాత్రమే పెంచిన ధరలకు అనుమతినిచ్చింది.
అమెరికాలో 500కి పైగా స్క్రీన్లలో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యింది. ఇప్పటికే $450K (సుమారుగా రూ.4 కోట్లు) వసూలయ్యాయని US డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగీరా సినిమాస్ ప్రకటించింది. బెంగళూరులో మొదటి రోజే 23 వేల టికెట్లు అమ్ముడవడం ద్వారా రూ.1 కోటి వసూలైంది.
క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం, తోట తరణి ఆర్ట్ వర్క్, మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి సాంకేతికంగా ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.