'హరి హర వీరమల్లు' హైలైట్స్!
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న మరో భారీ చిత్రం 'హరి హర వీరమల్లు'. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూలై 24న విడుదలవుతుంది.;
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న మరో భారీ చిత్రం 'హరి హర వీరమల్లు'. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ జూలై 24న విడుదలవుతుంది. వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ స్క్రీన్స్ లో ఈ చిత్రం రిలీజవుతుంది.
పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రం, 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఒక కల్పిత యోధుడి వీరగాథగా ఈ చిత్రం తెరకెక్కింది. వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటన ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు.
కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఆధ్యాత్మికత, ప్రేమ వంటి అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కించారు. ఇంటర్వెల్ ముందు, తరువాత వచ్చే యాక్షన్ బ్లాక్స్ సినిమాకు అసలైన బలంగా నిలవనున్నాయని చెబుతుంది టీమ్. ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేశాడు. 60 రోజుల పాటు చిత్రీకరించిన ఆ ఫైట్ సినిమాలో 18 నిమిషాల పాటు ఉండనుందట.
అంతర్జాతీయంగా 20 VFX బృందాలు ఈ సినిమాకి పనిచేశాయి. చార్మినార్ వంటి చారిత్రక నిర్మాణాలను అద్భుతంగా పునర్నిర్మించారు. ఒక్క చార్మినార్ సెట్‌కే రూ.3 కోట్లు ఖర్చయ్యాయంటే సినిమా విజువల్ లెవెల్స్ ఏ రేంజులో ఉంటాయో ఊహించుకోవచ్చు.
నిధి అగర్వాల్ (పంచమిగా), బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, తనికెళ్ల భరణి లాంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. 'మాట వినాలి, కొల్లగొట్టినాదిరో, అసుర హననం' వంటి పాటలు ఇప్పటికే విపరీతమైన స్పందన రాబట్టాయి. క్లైమాక్స్ యాక్షన్ సీన్ కోసం సంగీత దర్శకుడు కీరవాణి ఏకంగా 10 రోజుల పాటు రీ రికార్డింగ్ చేయడం మరో విశేషం. ఙ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ప్లస్ పాయింట్స్. మరికొద్ది గంటల్లో 'హరిహర వీరమల్లు' ప్రీమియర్స్ మొదలుకానున్నాయి.