‘కింగ్డమ్‘ ట్రైలర్ డేట్ ఫిక్స్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. జూలై 31న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రచారం కోసం ఇప్పటికే వరుస ఇంటర్యూలు ఇస్తున్నారు నిర్మాత నాగవంశీ.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. జూలై 31న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రచారం కోసం ఇప్పటికే వరుస ఇంటర్యూలు ఇస్తున్నారు నిర్మాత నాగవంశీ. ఈ వీకెండ్ నుంచి విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ భోర్సేతో పాటు మిగతా టీమ్ మీడియా ముందుకు రానుందట.
శ్రీలంక నేపథ్యంలో సాగే కథతో అన్నాదమ్ముల అనుబంధం హైలైట్ గా గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. ఈ సినిమాలో విజయ్ పోలీస్ గా, తిరుగుబాటుదారుడిగా విభిన్న తరహాలో అలరించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో అన్నాదమ్ములుగా కనిపిస్తున్న విజయ్, సత్యదేవ్ పాత్రల మధ్య ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు.
ఇప్పటికే రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బి.జి.ఎమ్ సినిమాకు మేజర్ ప్లస్ అవుతుందని భావిస్తోంది టీమ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ ను ప్లాన్ చేశారట. జూలై 26న ‘కింగ్డమ్‘ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది.