'కింగ్డమ్' ట్రైలర్.. విజయ్ మాస్ ర్యాంపేజ్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే లవర్ బాయ్, రస్టిక్ బాయ్ తరహా క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి. కానీ.. ఇప్పుడు 'కింగ్డమ్' కోసం ఓ సరికొత్త విజయ్ కనిపించబోతున్నాడు.;

By :  S D R
Update: 2025-07-26 17:44 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే లవర్ బాయ్, రస్టిక్ బాయ్ తరహా క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి. కానీ.. ఇప్పుడు 'కింగ్డమ్' కోసం ఓ సరికొత్త విజయ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాకోసం ఊర మాస్ లుక్ లో మెస్మరైజ్ చేయబోతున్నాడు దేవరకొండ. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న 'కింగ్డమ్' నుంచి ట్రైలర్ వచ్చేసింది.

ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం అండర్ కవర్ స్పై గా ఒక డేంజరస్ ప్రాంతానికి వెళ్లే విజయ్.. అక్కడ తాను ఎంతగానో ప్రేమించే అన్నతోనే పోరాడాల్సి వస్తోంది. చివరకు ఆ ప్రాంతం పరిస్థితులను అర్థం చేసుకుని.. ఆ రాజ్యానికి తానే రాజుగా ఎలా ఎదిగాడు అనేది ఈ మూవీ స్టోరీగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

ఈ సినిమాలో పోలీస్ గా, స్పై గా, ఖైదీగా, గ్యాంగ్‌స్టర్ గా ఇలా విజయ్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ చివరిలో మాస్క్ వేసుకుని సర్రైజింగ్ గా ట్రైబల్ లుక్ లోనూ సందడి చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు అర్థమవుతుంది. అనిరుధ్ రవిచందర్ బి.జి.ఎమ్. అదుర్స్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి రాబోతున్న 'కింగ్డమ్'పై ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. జూలై 31న గ్రాండ్ లెవెల్ లో 'కింగ్డమ్' రిలీజ్ కు రెడీ అవుతుంది


Full View


Tags:    

Similar News