'కూలీ' స్టోరీ రివీల్!
సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.;
సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. విడుదలకు ఇంకా కొంత సమయం ఉండగానే యూఎస్ బుకింగ్స్‌లో హాఫ్ మిలియన్ మార్క్ దాటడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను చాటుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా పూజా హెగ్డే చేసిన మోనిక సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా 'కూలీ' స్టోరీ లైన్ ను రివీల్ చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.
ఈ సినిమా కథలో గన్స్, డ్రగ్స్, టైమ్ ట్రావెల్ వంటి ఎలిమెంట్స్ ఉండవని, సినిమా మొత్తం లగ్జరీ వాచ్‌ల నేపథ్యంలో నడుస్తుందని దర్శకుడు లోకేష్ స్వయంగా వెల్లడించడంతో ఆసక్తి మరింత పెరిగింది. అలాగే లోకేష్ గత చిత్రాలు 'ఖైదీ, విక్రమ్'లతో ఈ మూవీకి ఎలాంటి లింక్ లేదని స్పష్టం చేశాడు. దీంతో ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగం కాదని తేలిపిఓయింది.
మరోవైపు ఈ మూవీలో రజనీకాంత్‌కు విలన్‌గా టాలీవుడ్ కింగ్ నాగార్జున కనిపించబోతున్నాడు. కింగ్ నాగార్జున రోల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. అమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం కూడా ఇందులో భాగమవ్వడంతో ‘కూలీ’పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో 'కూలీ' రిలీజ్ కు రెడీ అవుతుంది.