యాక్షన్ మొదలెడుతున్న సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య – టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.;
తమిళ స్టార్ హీరో సూర్య – టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతుంది.
ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించనున్నారట. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం సూర్య ప్రత్యేకంగా స్టంట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు టాక్. ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో సూర్యకి జోడీగా 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
మొత్తంగా.. 'సార్, లక్కీ భాస్కర్' తర్వాత సితారలో వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా కావడం.. పైగా పరభాషా కథానాయకుడితో కావడంతో ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ రైట్స్ ను ఓ లీడింగ్ ప్లాట్‌ఫామ్ రూ.80 కోట్లకు దక్కించుకున్నట్టు ప్రచారం జరిగింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.