ఈరోజే 'ఓజీ' గ్రాండ్ కాన్సర్ట్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ' రిలీజ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, దసరా కానుకగా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.;

By :  S D R
Update: 2025-09-21 02:13 GMT

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ' రిలీజ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, దసరా కానుకగా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా చుట్టూ హైప్ అతి భారీ స్థాయిలో పెరిగిపోయింది.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియం (ఎల్బీ స్టేడియం)లో ‘ఓజీ కాన్సర్ట్’ పేరిట గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. పవన్‌కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితర తారాగణం హాజరు కానున్నారు. ఈ వేడుకలో ప్రధానంగా పాటల విడుదల, ట్రైలర్ లాంచ్, లైవ్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్‌లతో అభిమానులకు ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారట.

ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ, షూటింగ్ బిజీ కారణంగా ఆయన వస్తారా? లేదా? సందేహం నెలకొంది. అయితే తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశముందని టాక్.



Tags:    

Similar News