'ఇడ్లీ కొట్టు'తో ఎమోషనల్ జర్నీ!
కొలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగానే కాదు దర్శకుడిగానూ వరుస విజయాలందుకుంటున్నాడు. ఈకోవలో లేటెస్ట్ గా 'ఇడ్లీ కడై' మూవీతో మరోసారి మెగా ఫోన్ పట్టాడు. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో వస్తోంది.;
కొలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగానే కాదు దర్శకుడిగానూ వరుస విజయాలందుకుంటున్నాడు. ఈకోవలో లేటెస్ట్ గా 'ఇడ్లీ కడై' మూవీతో మరోసారి మెగా ఫోన్ పట్టాడు. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో వస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 1న విడుదలకు ముస్తాబవుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
ట్రైలర్ విషయానికొస్తే.. మురళి (ధనుష్) తండ్రికి స్వగ్రామంలో ఒక చిన్న ఇడ్లీ కొట్టు ఉంటుంది. దానిపైనే ఆయన జీవితం, గౌరవం ఆధారపడి ఉంటుంది. తన తండ్రి కష్టాలను చూస్తూ పెరిగిన మురళి, చదువుకుని పెద్ద హోటల్ లో ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ అతని హృదయం మాత్రం ఊరిలోని ఆ ఇడ్లీ కొట్టుతోనే ఉంటుంది. తండ్రి మరణం తర్వాత మూసేసిన ఆ ఇడ్లీ కొట్టును మురళి తిరిగి ఎందుకు ప్రారంభించాడు? ఆ ప్రయత్నంలో అతడికి ఎదురైన విఘ్నాలు ఏంటి? అన్నదే అసలు కథ.
ఈ సినిమాలో ధనుష్ కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తే.. ఇతర కీలక పాత్రల్లో అరుణ్ విజయ్, సత్యరాజ్, షాలినీ పాండే, సముద్రఖని, రాజ్ కిరణ్ కనిపించనున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. మొత్తంగా.. 'ఇడ్లీ కొట్టు' సినిమా ఆద్యంతం ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో అలరించడానికి వచ్చేస్తుంది.