‘కాంతార‘ కోసం రెబెల్ స్టార్
ఈ దసరా కానుకగా పలు క్రేజీ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ముందుగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సెప్టెంబర్ 25న వస్తోంది.;
ఈ దసరా కానుకగా పలు క్రేజీ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ముందుగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘ సెప్టెంబర్ 25న వస్తోంది. ఆ తర్వాత అక్టోబర్ 1న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు‘ వస్తుండగా.. అక్టోబర్ 2న ‘కాంతార.. చాప్టర్ 1‘ రిలీజ్ కు రెడీ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ ‘కాంతార‘కి ప్రీక్వెల్ గా వస్తోన్న ‘కాంతార.. చాప్టర్ 1‘పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తెలుగులోనూ ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదలకు ముస్తాబవుతుంది.
లేటెస్ట్ గా ‘కాంతార.. చాప్టర్ 1‘ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయబోతుండటం విశేషం.
మరోవైపు తమిళ ట్రైలర్ ను శివ కార్తికేయన్, మలయాళం ట్రైలర్ ను పృథ్వీరాజ్ సుకుమారన్, హిందీ వెర్షన్ ట్రైలర్ ను హృతిక్ రోషన్ రిలీజ్ చేయబోతున్నారు. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన ‘కాంతార.. చాప్టర్ 1‘ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించింది.