‘ఓజీ’కి తెలంగాణ గ్రీన్ సిగ్నల్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు, స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;

By :  S D R
Update: 2025-09-19 16:08 GMT

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు, స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఈ కాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా వసూలు చేసుకోవచ్చు.

ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ విషయంలో తడబాటుకు గురవుతున్నాయి. సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం, టికెట్ రేట్లు – షోల పెంపు కోసం జీవోలు చివరి నిమిషంలో రావడం వల్ల బుకింగ్స్ కూడా లేట్‌గా మొదలవుతున్నాయి. దీంతో ఓపెనింగ్స్ దెబ్బతింటున్నాయి.

కానీ ‘ఓజీ’ మేకర్స్ మాత్రం ముందుగానే పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నారు. రెండు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రీమియర్స్ సహా అన్ని షోల కోసం ముందుగానే ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. ఈ రెండు, మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 21న 'ఓజీ' ట్రైలర్ రిలీజవుతుంది.

Tags:    

Similar News