సుకుమార్ రైటింగ్స్‌కి పదేళ్లు
తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్‌గా పేరుపొందిన సుకుమార్, ‘పుష్ప‘ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.;
తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్‌గా పేరుపొందిన సుకుమార్, ‘పుష్ప‘ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన ప్రయాణం కేవలం దర్శకత్వానికే పరిమితం కాలేదు. పక్కా క్రియేటివ్ మైండ్‌తో పాటు ప్రొడ్యూసర్‌గా కూడా సుకుమార్ తనదైన మార్క్ వేసుకున్నాడు. ఆయన స్థాపించిన ‘సుకుమార్ రైటింగ్స్’ నేటికి పది వసంతాలు పూర్తిచేసుకోవడం విశేషం.
2015లో ‘కుమారి 21ఎఫ్’తో మొదలైన ఈ బ్యానర్ లో ఎన్నో విలక్షణమైన సినిమాలు వచ్చాయి. ‘ఉప్పెన, 18 పేజెస్, విరూపాక్ష, గాంధీ తాత చెట్టు, పుష్ప-2’ వంటి మూవీస్ ఈ బ్యానర్ లో వచ్చాయి. సుకుమార్ తనతో కలిసి పనిచేసిన వారికి ఎప్పుడూ అండగా నిలబెడతాడు. అందుకే బుచ్చిబాబు, ప్రతాప్, కార్తీక్ దండు వంటి వారిని దర్శకులుగా నిలబెట్టాడు.
మరోవైపు ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ నుంచి రామ్ చరణ్, బుచ్చిబాబు ‘పెద్ది‘, నాగచైతన్య 24, చరణ్-సుకుమార్ సినిమాలు ఉన్నాయి. ఇంకా.. పలువురు యువ దర్శకులతో మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడట. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి కొన్ని సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడట క్రియేటివ్ జీనియస్ సుకుమార్.