జపనీస్ హైకూ పాడిన పవన్
‘ఓజీ’ సినిమా రిలీజ్‌కి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండగా.. అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు తిరగరాస్తుంటే, మరోవైపు చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ అందించింది.;
‘ఓజీ’ సినిమా రిలీజ్‌కి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండగా.. అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు తిరగరాస్తుంటే, మరోవైపు చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ అందించింది. ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ పాడిన ‘వాషి యో వాషి’ పాటను విడుదల చేసింది. ముఖ్యంగా ఈ పాటను పవన్ స్వయంగా జపనీస్ భాషలో పాడటం సంచలనమైంది. 'వాషి యో వాషి' అంటూ పవన్ తన స్టైల్లో చెప్పిన ఈ లైన్స్ అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్‌ని రెట్టింపు చేశాయి.
ఒక నిమిషం 52 సెకన్ల పాటు సాగే ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ కూడా జోడించడంతో ఫ్యాన్స్ కోసం ఇది స్పెషల్ ట్రీట్‌గా మారింది. ఇప్పటి వరకు ‘ఓజీ’ నుంచి విడుదలైన ప్రతి పాటా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తమన్ ఇచ్చిన ట్యూన్స్ మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పవన్ కల్యాణ్ స్వరంతో వచ్చిన ఈ కొత్త పాట మాత్రం అభిమానులకు పండగలా మారింది.
‘ఓజీ’పై ఉన్న అంచనాల స్థాయి చూస్తే, రికార్డులు కూల్చడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మెల్ బోర్న్ లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్‌లో టికెట్లు కేవలం రెండు నిమిషాల్లోనే అమ్ముడుపోవడం ఈ హైప్‌కు నిదర్శనం. యుఎస్‌లో ప్రీ సేల్స్‌తోనే 2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం, అందులో 1 మిలియన్ డాలర్లు కేవలం సినీ మార్క్ స్క్రీన్ల నుంచే రావడం సంచలనంగా మారింది.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓమి గా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 25న 'ఓజీ' రిలీజవుతుంది.