ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.;

By :  S D R
Update: 2025-04-11 13:43 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ అర్జున్ పాత్రలో నటించగా.. అతనికి తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కనిపించబోతుంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ రాబోతుంది. హనుమాన్ జయంతి కానుకగా రేపు (ఏప్రిల్ 12) సాయంత్రం 7:59 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. రేపు సాయంత్రమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.

ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా, శ్రీకాంత్, పృథ్వీరాజ్, సోహైల్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మొత్తంగా రేపు రానున్న ట్రైలర్ తో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'పై అంచనాలు ఏ రేంజులో పెరుగుతాయో చూడాలి. మరోవైపు అన్నాదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే వేదికను పంచుకోనుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



Tags:    

Similar News