మోడీ బయోపిక్ 'మా వందే'

దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు, పోరాటాలు ఎదుర్కొంటూ, చివరికి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ఆయన జీవితం నిజంగానే తెరిచిన పుస్తకంలా ఉంటుంది.;

By :  S D R
Update: 2025-09-17 07:25 GMT

దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు, పోరాటాలు ఎదుర్కొంటూ, చివరికి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ఆయన జీవితం నిజంగానే తెరిచిన పుస్తకంలా ఉంటుంది. ఈ ప్రయాణం గురించి ఇప్పటివరకూ పుస్తకాలు, కథనాలు, సినిమాలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు మరోసారి ఆయన జీవితకథను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.

మలయాళీ స్టార్ ఉన్ని ముకుందన్.. మోడీ పాత్రలో ‘మా వందే’ పేరుతో భారీ పాన్-ఇండియా బయోపిక్ తెరకెక్కుతోంది. తెలుగు ప్రేక్షకులకు ఉన్ని ముకుందన్ కొత్తేమీ కాదు. ‘జనతా గ్యారేజ్, భాగమతి, యశోద’ చిత్రాల్లో నటించాడు. అలాగే ‘మార్కో’ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించాడు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి తెలుగు డైరెక్టర్ క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వం వహిస్తుండగా.. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి ఎం నిర్మిస్తున్నారు. సంగీతాన్ని 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సమకూరుస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ వ్యవహరిస్తున్నాడు. ఇంకా నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్ వంటి టెక్నికల్ టీమ్ ఈ మూవీకి పని చేస్తుంది.

Tags:    

Similar News