వంద కోట్ల క్లబ్‌లో 'మిరాయ్'
తేజ సజ్జ హీరోగా నటించిన 'మిరాయ్' బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచింది. ఫాంటసీ, యాక్షన్, సూపర్ హీరో జానర్‌ల మేళవింపుతో వచ్చిన 'మిరాయ్' హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోంది.;
తేజ సజ్జ హీరోగా నటించిన 'మిరాయ్' బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచింది. ఫాంటసీ, యాక్షన్, సూపర్ హీరో జానర్‌ల మేళవింపుతో వచ్చిన 'మిరాయ్' హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరింది. సాధారణంగా స్టార్ హీరోలు మాత్రమే సాధించే ఈ ఘనతను తేజ తన టాలెంట్, కంటెంట్ సెలెక్షన్‌తో సాధించడం ప్రత్యేకంగా నిలుస్తోంది.
అమెరికాలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తూ 5 రోజుల్లోనే $2 మిలియన్ మార్క్‌ను దాటేసింది. ఇండియాలో మంగళవారం ఒక్కరోజే లక్షకు పైగా టికెట్‌లు అమ్ముడవ్వడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కి నిదర్శనం. హీరో తేజ సజ్జ అద్భుతమైన డెడికేషన్, విలన్‌గా మనోజ్ మంచు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అందించిన విజువల్ ట్రీట్, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ భారీ నిర్మాణ విలువలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు ట్రేడ్ పండిట్స్.