మోడీకి మహేష్, రాజమౌళి స్పెషల్ విషెస్

దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. మోడీకి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రజలు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.;

By :  S D R
Update: 2025-09-17 07:49 GMT

దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. మోడీకి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రజలు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి తమదైన శైలిలో ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

“గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మీ నాయకత్వం ఎప్పటికీ అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉండాలని కోరుకుంటున్నాను” అని మహేష్ బాబు, రాజమౌళి తమ వీడియో సందేశంలో తెలిపారు.





Tags:    

Similar News