'మిరాయ్' మరోసారి వాయిదా?

‘హనుమాన్’ తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన తేజ సజ్జ.. ఇప్పుడు 'మిరాయ్'తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేస్తామని ప్రకటించినా, షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్ట్ 1కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.;

By :  S D R
Update: 2025-05-21 04:29 GMT

‘హనుమాన్’ తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన తేజ సజ్జ.. ఇప్పుడు 'మిరాయ్'తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేస్తామని ప్రకటించినా, షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్ట్ 1కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఇంకా కొన్ని కీలక భాగాలు చిత్రీకరణకు మిగిలే ఉన్నాయట. లేటెస్ట్ గా ముంబైలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోందని, అక్కడి చారిత్రక గుహల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు.

పోస్ట్ ప్రొడక్షన్ పకడ్బందీగా కొనసాగుతున్నప్పటికీ, మిగిలిన రెండు నెలల్లో సినిమా పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందుకే, తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రిలీజ్ డేట్ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇది సినిమా విడుదల మరోసారి వాయిదా పడే సూచనలుగా భావిస్తున్నారు.

ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. గౌర హరి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో 'మిరాయ్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. 'హనుమాన్' తరహాలోనే తేజ సజ్జ 'మిరాయ్'తో మరో బంపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Tags:    

Similar News