‘లిటిల్ హార్ట్స్’పై మహేష్ ప్రశంసలు

చిన్న సినిమాగా విడుదలైన 'లిటిల్ హార్ట్స్' బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి తనుజ్, శివాని నాగరం హీరో–హీరోయిన్లుగా నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది.;

By :  S D R
Update: 2025-09-17 00:38 GMT

చిన్న సినిమాగా విడుదలైన 'లిటిల్ హార్ట్స్' బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి తనుజ్, శివాని నాగరం హీరో–హీరోయిన్లుగా నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లి కంపోజ్ చేసిన పాటలు కూడా సినిమాకి హైలైట్ అయ్యాయి.

తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేయడంతో టీమ్‌కి డబుల్ సెలబ్రేషన్ వాతావరణం నెలకొంది. “లిటిల్ హార్ట్స్ సరదాగా, కొత్తగా చాలా బాగుంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్, నువ్వు త్వరలోనే చాలా బిజీ అవుతావు” అని మహేష్ పోస్ట్ చేశాడు.

ఈ ట్వీట్‌తో సింజిత్ గాల్లో తేలిపోయాడు. “నేను ఎక్కడికీ వెళ్లను మహేష్ అన్నా” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. దర్శకుడు సాయి మార్తాండ్, హీరో–హీరోయిన్లు కూడా తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్సాహంగా రియాక్ట్ అయ్యారు.



Tags:    

Similar News