‘కిష్కింధపురి‘కి మెగా సర్టిఫికెట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం ‘కిష్కింధపురి‘. ఎక్కువగా యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో అలరించే బెల్లంకొండ.. తొలిసారిగా చేసిన హారర్ థ్రిల్లర్ ఇది.;
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం ‘కిష్కింధపురి‘. ఎక్కువగా యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో అలరించే బెల్లంకొండ.. తొలిసారిగా చేసిన హారర్ థ్రిల్లర్ ఇది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ‘కిష్కింధపురి‘ చిత్రం సెప్టెంబర్ 12న విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. మౌత్ టాక్ తో ‘కిష్కింధపురి‘ కలెక్షన్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచే కాదు సెలబ్రిటీల నుంచి సైతం ప్రశంసలు వర్షం కురుస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీకి మెగా సర్టిఫికెట్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి ‘కిష్కింధపురి‘ చిత్రాన్ని వీక్షించి సినిమా గురించి తనదైన శైలిలో విశ్లేషించిన వీడియోని నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ప్రస్తుతం షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి.. చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు‘ సినిమాకి నిర్మాత కావడం విశేషం.