‘హాయ్ నాన్న‘ కాంబో రిపీట్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్‘తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తనకు ‘దసరా‘ వంటి సూపర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-09-16 10:35 GMT

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్‘తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తనకు ‘దసరా‘ వంటి సూపర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు లేటెస్ట్ గా ‘హాయ్ నాన్న‘ డైరెక్టర్ శౌర్యువ్ తోనూ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

నాని-శౌర్యువ్ కాంబోలో వచ్చిన ‘హాయ్ నాన్న‘ రొమాంటిక్ డ్రామాగా మంచి విజయాన్ని సాధించింది. ‘హాయ్ నాన్న‘ సినిమాలో నానిని ఫ్యామిలీ మ్యాన్ గా చూపించిన శౌర్యువ్.. ఈసారి పీరియాడికల్ స్టోరీలో చూపించబోతున్నాడట. ఈ సినిమాని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ఇప్పటికే నాని సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ చిత్రానికి సంబంధించి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. సుజీత్ డైరెక్ట్ చేసిన ‘ఓజీ‘ రిలీజైన తర్వాత నాని సినిమాకి సంబంధించి అప్డేట్ రానున్నట్టు తెలుస్తోంది. ఇంకా.. ‘జై భీమ్‘ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్‌తోనూ నాని ఒక సినిమా చేయాల్సి ఉందట. మొత్తంగా.. వరుస విజయాలతో నేచురల్ స్టార్ ఇకపై దూకుడు పెంచబోతున్నాడు.

Tags:    

Similar News