30 కోట్లు పెడితే 300 కోట్లు
ఈ సంవత్సరం మలయాళ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన సినిమా 'లోక చాప్టర్ 1: చంద్ర'. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదలైంది.;
ఈ సంవత్సరం మలయాళ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన సినిమా 'లోక చాప్టర్ 1: చంద్ర'. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదలైంది. ఫాంటసీ–అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. కేవలం ఆరు వారాల్లోనే రూ.300 కోట్ల వసూళ్లు సాధించి కొత్త చరిత్ర రాసింది.
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఉమన్ సూపర్‌హీరో మూవీని డొమినిక్ అరుణ్ తెరకెక్కించగా దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. పురాణాలు, తత్వశాస్త్రం నేపథ్యంలో విజువల్ వండర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇంతవరకు మలయాళంలో ఉన్న 'L2: ఎంపురాన్, మంజుమ్మెల్ బాయ్స్' వంటి సినిమాలను దాటి, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.
'లోక' సిరీస్ లో సెకండ్ చాప్టర్ లో టోవినో థామస్ కొత్త సూపర్‌హీరోగా కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా, 'లోక' అక్టోబర్ 20 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. మొత్తానికి.. 'లోక' మలయాళ సినిమాను గ్లోబల్ స్టేజ్‌పై మరో మెట్టుకు చేర్చిన విజువల్ వండర్‌గా నిలిచింది.