డిసెంబర్ లో వస్తోన్న ‘మోగ్లీ’
సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం 'మోగ్లీ 2025'. ‘కలర్ ఫోటో’తో మంచి విజయాన్నందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.;
సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం 'మోగ్లీ 2025'. ‘కలర్ ఫోటో’తో మంచి విజయాన్నందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా, బండి సరోజ్ కుమార్ విలన్‌గా, హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ అడ్వెంచరస్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. నాని వాయిస్‌ఓవర్ ఇచ్చిన వీడియోలో రోషన్ పాత్రలోని ఎమోషన్, ఇన్‌టెన్సిటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాల భైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 12న 'మోగ్లీ' ఆడియన్స్ ముందుకు వస్తోంది.