సెన్సార్ క్లియర్, ట్రైలర్ రెడీ!

‘మిరాయ్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మూవీ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, అందాలతారలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.;

By :  S D R
Update: 2025-10-13 00:51 GMT

‘మిరాయ్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మూవీ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, అందాలతారలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ప్రఖ్యాత స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రం అక్టోబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. రన్‌టైమ్ 2 గంటల 16 నిమిషాలుగా ఉండగా, ఎలాంటి లాగింగ్ లేకుండా సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగిందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని మేకర్స్ తెలిపారు.

ఇక సినిమా ట్రైలర్‌ను ఈరోజు (అక్టోబర్ 13) ఉదయం 11:34 గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమన్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్‌గా మారాయి. ట్రైలర్‌తో సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం. ‘DJ టిల్లు’ సిరీస్ తరువాత మంచి హిట్ కోసం సిద్ధూకి 'తెలుసు కదా' ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News