శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తప్పవు!

సోషల్ మీడియాలో మహాత్మా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఈ విషయం మీద కాంగ్రెస్ ఎంఎల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;

By :  S D R
Update: 2025-10-12 09:13 GMT

సోషల్ మీడియాలో మహాత్మా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఈ విషయం మీద కాంగ్రెస్ ఎంఎల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'శ్రీకాంత్ అయ్యంగార్ మా అసోసియేషన్ సభ్యుడు. ఆయన గాంధీజీ గురించి ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెడుతున్నాడు. చాలా మంది మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో విభేదాలు రగిలించే ప్రమాదం ఉంది. ఫాదర్ ఆఫ్ ది నేషన్‌పై ఇలాంటి మాటలు అనేది సహించరానిది' అని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాక, 'మేము ఇప్పటికే సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేశాం. అసోసియేషన్ కూడా ఆయన్ను విచారించి చర్యలు తీసుకోవాలి. సినీ పెద్దలు, హీరోలు కూడా స్పందించాలి. లేదంటే మేము యాంటీ బయోటిక్ కావాల్సి వస్తుంది' అని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ కూడా స్పందించారు. 'ఇప్పుడంతా ఫ్రీడం ఆఫ్ స్పీచ్ పేరుతో ఏదైనా మాట్లాడుతున్నారు. కానీ మా దగ్గర డిసిప్లినరీ కమిటీ ఉంది. చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం, త్వరలోనే చర్యలు ఉంటాయి' అని చెప్పారు.

Tags:    

Similar News