క్రేజీ కాంబినేషన్ ఫిక్స్?

ఒకప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ‘లైగర్, డబుల్ ఇస్మార్ట్‘ వంటి వరుస పరాజయాల తరువాత మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-03-17 09:34 GMT

ఒకప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ‘లైగర్, డబుల్ ఇస్మార్ట్‘ వంటి వరుస పరాజయాల తరువాత మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు.పలువురు హీరోలను కలుస్తూ కథలు వినిపిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే, లేటెస్ట్ గా పూరి కొత్త ప్రాజెక్ట్‌కి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్టేనట. తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న విజయ్ సేతుపతి, పూరి ప్రత్యేకంగా డిజైన్ చేసే క్యారెక్టర్‌లో ఎలా కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సేతుపతి కోసం రెగ్యులర్ మాఫియా లేదా డ్రగ్స్ నేపథ్యం కాకుండా, ఒక క్రైమ్ థ్రిల్లర్ కథాంశాన్ని పూరి సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇప్పటికే పూరి చెన్నై వెళ్లి విజయ్ సేతుపతికి కథ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో మిగతా అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అయితే, పూరి ఈ సినిమా స్వయంగా నిర్మిస్తాడా? లేక వేరే బ్యానర్‌లో చేస్తాడా? అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News