క్యాండిడ్ స్టిల్.. క్రేజీ ప్రాజెక్ట్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మ్యావరిక్ డైరెక్టర్ సుకుమార్ కలిసి దిగిన లేటెస్ట్ క్యాండిడ్ ఫోటో సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మ్యావరిక్ డైరెక్టర్ సుకుమార్ కలిసి దిగిన లేటెస్ట్ క్యాండిడ్ ఫోటో సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ ఫోటోను సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఆదివారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, 'తారక్ కి ప్రేమతో' అనే క్యాప్షన్‌తో పాటు లవ్ ఎమోజీని జత చేసింది.
ఈ పోస్టుకి ఎన్టీఆర్ ఇచ్చిన స్పందన మాత్రం ఆప్యాయతతో నిండిన అనుబంధాన్ని ప్రతిబింబించింది. తబిత పోస్టుకు ఎన్టీఆర్ స్పందిస్తూ, 'నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్' అనే తన ఎమోషనల్ డైలాగ్‌ను రిపీట్ చేశాడు. ఇది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో అతను చెప్పిన ప్రసిద్ధమైన డైలాగ్. ఈ మెస్సేజ్‌లో సుకుమార్‌ను కూడా ట్యాగ్ చేశాడు తారక్.
2016లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమా, సుకుమార్–ఎన్టీఆర్ కాంబినేషన్‌కు ఒక మైలురాయిగా నిలిచింది. ఫాదర్ అండ్ సన్ అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. ఈ సినిమా తరువాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఈ లేటెస్ట్ క్యాండిడ్ స్టిల్ తో మరోసారి ఎన్టీఆర్-సుకుమార్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2, డ్రాగన్, దేవర 2' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సుకుమార్ రామ్ చరణ్17వ సినిమా, 'పుష్ప 3' చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. మరి.. తారక్-సుక్కూ కాంబో మళ్లీ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.