చంద్రబాబుని కలిసిన నాగార్జున

అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్కినేని అఖిల్ వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నాడు. గతేడాది నవంబర్‌లో అఖిల్ – జైనబ్ రవ్జీ నిశ్చితార్థం జరిగింది.;

By :  S D R
Update: 2025-06-03 07:27 GMT

అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్కినేని అఖిల్ వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నాడు. గతేడాది నవంబర్‌లో అఖిల్ – జైనబ్ రవ్జీ నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఇదే స్టూడియోలో నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల వివాహం కూడా జరిగింది.

అఖిల్ పెళ్లి నేపథ్యంలో అతిథులను ఆహ్వానించే సందడిలో ఉన్నారు కింగ్ నాగార్జున. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన నాగార్జున.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తమ కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 6న అఖిల్ వివాహం జరగబోతుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News