జూన్ రెండో వారం నుంచి 'ఉస్తాద్'!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మళ్లీ గాడిలో పడింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.;
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మళ్లీ గాడిలో పడింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. గతంలో కొంత భాగం చిత్రీకరణ జరగగా.. ఆ తర్వాత చాలా నెలల పాటు ఈ సినిమా ఆగిపోయింది.
తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హరీష్ శంకర్, జూన్ రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించాడు. ఈ షెడ్యూల్ సుమారు నెలరోజుల పాటు సాగే అవకాశముంది. పవన్ కల్యాణ్ – శ్రీలీలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. మొదటి రెండు రోజుల్లోనే పవన్ షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
గతంలో 'గబ్బర్ సింగ్'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన పవన్ - హరీష్ శంకర్ కలయికపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తొలుత ఈ ఏడాది దీపావళి రిలీజ్‌గా అనుకున్నా, తాజా సమాచారం ప్రకారం ఇది 2026లో విడుదలయ్యే అవకాశముంది.
మరోవైపు ఇప్పటికే 'హరిహర వీరమల్లు'ని పూర్తి చేసి 'ఓజీ' షూటింగ్ మొదలు పెట్టాడు పవర్ స్టార్. ఇటీవల ముంబైలో పవన్ ఈ షూట్ లో పాల్గొన్న విజువల్స్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొట్టాయి. మొత్తంగా.. పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటం ఆయన అభిమానులకు ఆనందాన్ని పంచుతుంది.