గ్లోబల్ స్టార్ తో సెన్సేషనల్ డైరెక్టర్?

ఇండస్ట్రీలో ఇప్పుడు నయా కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అలాంటిదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో.;

By :  S D R
Update: 2025-04-16 00:06 GMT

ఇండస్ట్రీలో ఇప్పుడు నయా కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అలాంటిదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో. 'అర్జున్ రెడ్డి' నుంచి 'యానిమల్' వరకు, వంగా తనదైన శైలితో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 'స్పిరిట్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రభాస్ 'స్పిరిట్' సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

మరోవైపు సందీప్ రెడ్డి తర్వాతి ప్రాజెక్టులపై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. 'స్పిరిట్' తర్వాత ఇప్పటికే 'యానిమల్ పార్క్', అల్లు అర్జున్ చిత్రాలను అనౌన్స్‌ చేశాడు. వీటితో పాటుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తోనూ ఓ భారీ సినిమా చేసే ఆలోచనలో వంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో, ఆ స్థానంలో చరణ్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం.

'గేమ్ చేంజర్' కోసం మూడు సంవత్సరాల సమయాన్ని వెచ్చించిన రామ్ చరణ్, ఈ సారి పక్కా ప్లానింగ్ తో గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనే నిశ్చయంతో ఉన్నాడట. ఈకోవలోనే సందీప్ రెడ్డి సినిమాని ఓ.కె. చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా త్వరలోనే చరణ్-సందీప్ కాంబో మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.

Tags:    

Similar News