ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎంపిక
విజయవాడ బీజేపీ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్న మాధవ్;
By : Dasari Suresh
Update: 2025-06-30 09:23 GMT
ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది, అధ్యక్ష పదవికి మాజి ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకులు పి వీ ఎన్ మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రస్తుత కార్యదర్శిగా ఉన్న ఆయన.. గతంలో మంత్రివర్గ భాజపా ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్, బీజేవైయమ్ ల లో బాధ్యతలు నిర్వహించారు,మాధవ్. ఈయన తండ్రి చలపతి రెండుసార్లు ఎమ్మెల్సీగా పదవులు చేసారు.అధ్యక్ష పదవికి మాధవ్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయన్నునారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.