రేవంత్ రెడ్డి కీలక ప్రకటన- మహిళలకు 60 అసెంబ్లీ టికెట్లు ఇస్తామని హామీ

రాజకీయాల్లో మహిళలకు సమానస్థానం,33 శాతం కాదు... అదనంగా 10 సీట్లు;

Update: 2025-07-07 08:58 GMT

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు.మహిళలకు అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం" అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119. పునర్విభజన అనంతరం ఈ సంఖ్య 153కి పెరిగే అవకాశముంది. 153 సీట్లలో 33 శాతం అంటే దాదాపు 51 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. కాకపోతే, అదనంగా మరో 10 సీట్లు కలిపి మొత్తం 60 సీట్లను మహిళలకు కేటాయించేలా ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ ప్రకటనకు రాజకీయ వర్గాల్లో విశేష స్పందన లభిస్తోంది. గతంలో మహిళా రాజకీయ ప్రాతినిధ్యంపై పెద్దగా చర్చ లేకుండా పోతుండగా, ఈసారి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీఎం రేవంత్ రెడ్డి ఓ ఘనమైన అడుగు వేసినట్లయ్యింది.

మహిళలు మార్పుకు ప్రతిరూపాలు... నేతృత్వానికి అర్హులు అనే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం, రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన మలుపుగా చర్చకు వస్తోంది.

"నినాదాలతో కాదు... నిజమైన ప్రాతినిధ్యంతో మహిళల హక్కులను చాటుతాం అనే సంకల్పానికి ఇది సంకేతమనే తెలిసేలా కాంగ్రెసుపార్టీ చేస్తుంది అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.



Tags:    

Similar News