50 ఏళ్ల తర్వాత నాసా పసిఫిక్‌లో చారిత్రక ల్యాండింగ్
స్పేస్‌ఎక్స్‌తో అమెరికా, జపాన్, రష్యా వ్యోమగాముల భూమికి సురక్షిత రాక;
అమెరికా, జపాన్, రష్యా దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు ఆరు నెలల పాటు అంతరిక్షంలో సేవలు అందించి భూమికి సురక్షితంగా చేరుకున్నారు. వీరిని తీసుకువచ్చిన స్పేస్‌ఎక్స్(Space X) అంతరిక్ష నౌక శనివారం ఫ్లోరిడా తీరంలో సముద్రంలో విజయవంతంగా దిగింది.ఈ నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో శాస్త్రీయ పరిశోధనలు చేస్తూ గడిపారు. భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ఉపయోగపడే విలువైన సమాచారం, డేటాను సేకరించారు.
ఈ మిషన్‌లో అమెరికా నాసా వ్యోమగాములు ఆన్ మెక్‌క్లేన్, నికోల్ అయర్స్, జపాన్‌కు చెందిన టకుయా ఒనిషి, రష్యా వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ పాల్గొన్నారు. అంతరిక్షంలో కలిసి పని చేస్తూ, అనేక శాస్త్రీయ ప్రయోగాలు విజయవంతంగా పూర్తిచేశారు.ఈసారి జరిగిన స్ప్లాష్‌డౌన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది 50 ఏళ్ల తర్వాత నాసా పసిఫిక్ మహాసముద్రంలో చేసిన మొదటి ల్యాండింగ్ కావడం. ఈ ఘట్టం అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.