హైదరాబాద్‌లో CM రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన

అమీర్‌పేట్, బుద్ధనగర్, మైత్రీవనం మునిగిపోయాయి - అధికారులకు తక్షణ చర్యలు తీసుకోమని సూచనలు;

Update: 2025-08-10 14:37 GMT

హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షలా కారణంగా అమీర్‌పేట్ ప్రాంతంలోని బుద్ధనగర్, మైత్రీవనం ప్రాంతాలు వరద నీటితో పూర్తిగా మునిగిపోయాయి. ఈ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అకస్మికంగా పరిశీలించారు.బుద్ధనగర్‌లో ముఖ్యమంత్రి డ్రైనేజీ వ్యవస్థను సమీక్షించారు. అక్కడ కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువలు ఎక్కువ ఎత్తులో ఉండటంతో నీరు బాగా పారలేక, అడ్డంకిగా నిలవడం వల్ల వరద తీవ్రత పెరిగిందని గుర్తించారు. అందువల్ల, తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించి వరద నీరు సులభంగా పారేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

అయితే గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చి, పార్కింగ్ కోసం వాడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ సమాచారం తెలుసుకున్న సీఎం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు త్వరగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

తాజాగా మైత్రీవనం ప్రాంతంలో వరద నీరు నిలిచిపోయిన పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి, స్థానికుల నుండి సమస్యల గురించి వివరాలు తీసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

పర్యటన సమయంలో బుద్ధనగర్‌లో ఉండే జస్వంత్ అనే ఏడో తరగతి విద్యార్థికి సీఎంతో మాట్లాడుతూ తన ఇంట్లోకి వరద నీరు వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆవేదనని వ్యక్తపరిచాడు.ముఖ్యమంత్రి భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధైర్యం చెప్పారు.ఈ పర్యటనలో HYDRAA కమిషనర్ రంగనాథ్ IPS, GHMC కమిషనర్ సహా ఇతర అధికారులు ముఖ్యమంత్రి తో ఉన్నారు. సీఎం వారికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ విధంగా, వరద ప్రభావిత ప్రాంతాల సమస్యలను తెలుసుకుని, వాటికి తక్షణమే మరియు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు మార్గదర్శకత్వం ఇచ్చారు.

Tags:    

Similar News