జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు రోజులు పాటు నిర్వహించబోయే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమానికి శ్రీకారం;
By : Dasari Suresh
Update: 2025-07-05 12:38 GMT
తిరుమలలో జూలై 16న ఘనంగా శ్రీవారి ఆణివార ఆస్థానం వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని, జూలై 15న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టనుంది.
ఈ నేపథ్యంలో జూలై 15 మరియు 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయబడుతున్నాయని టీటీడీ ప్రకటించింది.అలాగే, జూలై 14, 15 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని తెలియజేసింది.