గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన జగన్ సంస్కృతి: మంత్రి కొల్లు రవీంద్ర ఘాటైన విమర్శలు

ఫ్యాక్షన్ ఆచారాలతో రాష్ట్రాన్ని రక్తపాతానికి గురి చేసిన జగన్: టీడీపీ మంత్రి ఆరోపణ;

Update: 2025-07-05 14:14 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత అసత్య ఆరోపణలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.జగన్ రెడ్డి ఫ్యాక్షన్ సంస్కృతిని గ్రామాల్లో వ్యాప్తి చేసి నెత్తుటి ఏర్లు పారించారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించి, హింసాత్మక దాడులతో ఊర్లు ఖాళీ చేయించారు అని ఆయన పేర్కొన్నారు.

గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుల వేధింపులతో గ్రామాలను విడిచి వెళ్ళిన ప్రజల వివరాలు మంత్రి వెల్లడించారు.విజయవాడలో చెన్నుపాటి గాంధీ కంటి చూపు కోల్పోయిన ఘటనకు వైసీపీ పాలననే కారణమన్నారు.దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్ పై దాడి, ఇసుక మాఫియా అరాచకాలు, మహిళలపై దాడులు వంటి అనేక ఘటనలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం, మృతులపై తప్పుడు కేసులు వేసి మీడియా ను మానిప్యులేషన్ చేయడం వంటి చర్యలతో జగన్ ప్రభుత్వానికి “క్రిమినల్ సంస్కృతి” అనే ముద్ర పడిందన్నారు.టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన జోగి రమేష్‌కు మంత్రి పదవి, బూతులు మాట్లాడిన వారికి రక్షణ, పత్రికల గొంతు నొక్కే జీవోలు వైస్సార్సీపీ చేసింది దుయ్యపట్టారు.బియ్యం దొంగతనం చేసినవాడిని మీడియా ముందు కూర్చోబెడుతున్నాడు జగన్, ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరం అని మండిపడ్డారు.

ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.రూ.4000 పెన్షన్, వికలాంగులకు రూ.6000, కిడ్నీ బాధితులకు రూ.10,000, బెడ్ మీద ఉన్నవారికి రూ.15000 అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్నారు.ఉచిత గ్యాస్, తల్లికి వందనం, సీసీరోడ్లు, రోడ్ల మరమ్మతులు వంటి పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

త్వరలో అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కానున్నదని వెల్లడించారు.తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజలను మోసగించాలనుకోవడం మూర్ఖత్వం. బురదజల్లే పేటీఎం బ్యాచ్‌లను పెట్టుకోవడం ఫలితం ఇవ్వదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. వైసీపీ త్వరలో పూర్తిగా ఖాళీ అవుతుంది," అని మంత్రి కొల్లు రవీంద్ర గట్టి హెచ్చరిక చేశారు.

Tags:    

Similar News