అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి బలమైన మద్దతు!
నిర్మలా హామీకి కార్యరూపం – అమరావతికి రూ.15,000 కోట్లు మంజూరు;
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంతో బిగ్ రిలీఫ్ ప్రకటించింది. ఇప్పటికే అప్పుల భారంలో ఉన్న రాష్ట్రానికి ఆర్థికంగా ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి గతంలో వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) వంటి సంస్థల ద్వారా తీసుకున్న రూ.15,000 కోట్ల రుణాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రాంటుగా మార్చేందుకు సిద్ధమైంది.
ఇది సాధారణ రుణంగా కాకుండా ‘ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్’ కింద నేరుగా రాష్ట్ర అప్పుగా నమోదు కాలేదనే కారణంగా, దీనిని గ్రాంటుగా మారుస్తున్నట్టు సమాచారం. ఇది రాష్ట్రంపై ఉన్న వడ్డీ భారం తగ్గించడమే కాకుండా, తిరిగి చెల్లింపుల బాధ్యత నుంచి బయటపడేందుకు అవకాశం కల్పిస్తోంది.అమరావతి నిర్మాణం కోసం మొత్తం అంచనా వ్యయం రూ.71,000 కోట్లు,ఇప్పటివరకు రూ.58,000 కోట్ల విలువైన టెండర్లు జారీ,2025–26లో వడ్డీ చెల్లింపుల ఖర్చు రూ.34,998 కోట్లు చేరనున్న అంచనా,కేంద్ర నిర్ణయం వల్ల ఈ ఖర్చు కొంత మేర తగ్గే అవకాశం కనిపిస్తుంది.రాష్ట్రానికి అదనంగా అప్పులు తీసుకునే అవకాశాలు వస్తాయి2025–26 ఆర్థిక లోటు, స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 4.4% ఉండే అవకాశంఅప్పు తగ్గడం వల్ల ఆర్థిక లోటుపై ప్రభావం పడుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్రంలోని NDA మద్దతు స్పష్టమవుతోంది.గత ఏడాది జులైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ హామీకి ప్రకటన రూపం లభించింది.
ఈ నేపథ్యంలో, రాజధాని నిర్మాణానికి కేంద్రం మరింతగా మద్దతుగా నిలుస్తుండటం స్పష్టమవుతోంది. అదే విధంగా, రాబోయే రోజుల్లో ఇతర ఆర్థిక అవసరాలకు కేంద్రం నుంచి మరిన్ని సహాయాలు రావచ్చన్న అంచనాలు ఉన్నాయి.