సింహాచలంలో మరోసారి భద్రతా పొరపాటు!
తొలిపావంచా వద్ద షెడ్ కుప్పకూలిన ఘటన.. భక్తుల్లో ఆందోళన;
By : Dasari Suresh
Update: 2025-07-05 17:47 GMT
సింహాచల దేవస్థానంలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో భాగంగా తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన రేకుల షెడ్ కుప్పకూలింది. కాంక్రీట్ బేస్ లేకపోవడంతో బరువుతో కింద పడిపోయిందని అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
గతంలో ఏప్రిల్ 30న చందనోత్సవం సందర్భంగా క్యూలైన్‌లో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన మరువకముందే మరో ప్రమాదం జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. జూలై 9న ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని భద్రత చర్యలు పెంచాలని భక్తులు కోరుతున్నారు.