ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజమహేంద్రవరం పర్యటన
ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన;
ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరం విచ్చేసారు,సుమారు రూ.94.44 కోట్లతో ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపనకై ,కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి తో కలిసి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసారు.
ఉభయగోదావరి జిల్లాల పర్యాటక కేంద్ర ప్రాజెక్టుగా ఈ అఖండ గోదావరిని,రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన జరగడం శుభ సందర్భంగా భావిస్తున్నాం తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ బ్రిడ్జి, బ్రిడ్జిలంక, పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ దేవాలయం,గోదావరి కాలువను సర్క్యూట్ గా ఏర్పాటు చేయనున్నాం అన్నారు మంత్రి.
డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి రాజమహేంద్రవరానికి విచ్చేసారు పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం చాలా కీలకమని, ఈ రంగంలో యువతకు ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చ’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 4 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. రూ.430 కోట్లతో ఈ రోజు రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని, త్వరలోనే రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామని తెలియచేశారు. శంకుస్థాపన అనంతరం కేంద్రం నిధులు రూ. 375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టబోయే ప్రాంతాన్ని పరిశీలించారు.
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాకా.. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు, మేము ముందుగా అనుకున్నది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించేలా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం అన్నారు. ముఖ్యంగా పర్యటక రంగంలో ఇరత రాష్ట్రాలతో పోటీ పడేలా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలనుకున్నాం.,అందులో భాగంగానే ఈ రోజు ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన అన్నారు. ఈ ప్రాజెక్టుకు గౌరవ ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది అని కొనియాడారు. ప్రాజెక్టుకు రూపం తీసుకొచ్చిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, వారి శాఖా అధికారులను, ఈ ప్రాజెక్టు మంజూరు కావడంలో తన పూర్తి సహాయ సహకారాన్ని అందించిన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియ చేసారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అని అలాగే గోదావరి, కృష్ణా, వంశధార వంటి నదీ తీరాలు ఉన్నాయి అని,మిగతా దేశాల్లో అయితే హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి పెట్టి అభివృద్ధి చేస్తారు కానీ మన దేశంలో మాత్రం నదులు మన జీవన విధానం, సంస్కృతిని చూపించి అభివృద్ధి చేద్దాం అన్నారు పవన్. అందుకే అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఘాట్ లో ఉన్న ఆలయాల విశిష్టత తెలియజేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు గోదావరి హారతి ఇచ్చేలా తీర్చిదిద్దుతాం అన్నారు. 127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని దశాబ్ధాలుగా ఉన్న ఆకాంక్షను సాకారం చేస్తునట్టు ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం.2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేలా అఖండ గోదావరి ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నాం” అన్నారు.