వైసీపీకి మరో దెబ్బ? మిథున్ రెడ్డి బెయిల్ హైకోర్టు రద్దు
ఆన్లైన్ మద్యం వ్యవస్థ రద్దుతోనే స్కాం ప్రారంభమయ్యిందన్న సిట్ – వైసీపీ పాలనలో ‘హ్యాండ్‌ల్’ చేసిన మిథున్!;
క్రమంగా వెలుగులోకి వస్తున్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ-4 నిందితుడిగా ఉన్నప్పటికీ, అధికార వైసీపీ హయాంలో ఈ వ్యవహారం అంతా ఆయన చేతుల మీదుగా నడిచినట్లుగా సిట్ (SIT) అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదివరకు రాష్ట్రంలో మద్యం వ్యవహారం అంతా ఆన్లైన్ పద్దతిలో జరిగేది అని,వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఆన్లైన్ లావాదేవీలు తొలగించారు అని,దాదాపుగా రాష్ట్ర ఖజానా లో 3500 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టు సిట్ బృందం తరపు న్యాయవాది సిద్దార్థ ల్యూద్రా గురువారం హైకోర్టు లో తన వాదాలను వినిపించారు.అంతే కాకుండా మద్యం కుంభ కోణం లో కీలక సూత్రధారి మిధున్ రెడ్డి అని,ఇతనిపై ఇప్పటికే 8 కేసులు ఉన్నట్టు సిద్ధార్ధ్ కోర్ట్ కి తెలియచేసారు.
ఇదే విషయంగా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి నేరుగా సుప్రీం కోర్టుని ఆశ్రయించగా,ముందుగా హైకోర్టులో విచారణ జరుపుకోండి అంటూ తిరస్కరించింది. అయితే, అప్పట్లో అరెస్టు చేయొద్దని కూడా సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి మళ్ళీ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ అక్కడ కూడా పిటిషన్ తిరస్కరణ చెందితే ఆయన అరెస్టు తథ్యం అవుతుంది.ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రపై ఆర్ధిక లావాదేవీల ఆధారంగా సిట్ ఆవేదనను బలంగా చూపుతోంది.ఇదంతా చూస్తుంటే త్వరలోనే మిధున్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనే తెలుస్తుంది.
ఇప్పుడు జగన్ ముందు ఇంకొక కీలక సవాలు ఎదురవుతోంది.వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని జైలుకు పంపకుండా రక్షించడంలో జగన్ కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్టు కాకుండా కాపాడగలరా? అనేది రాజకీయంగా ప్రాధాన్యతనెంచుకుంది.